మేనెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు..! 10 h ago
TG : వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, అందులో భాగంగా మార్చి 31వ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్‌కు నిర్దిష్టకాలపరిమితి ఉంటుందని, అదే విధానాన్ని ఇక్కడా పాటించడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ మేరకు, కమిషన్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.